రేపు మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఈసి, ఐసి, శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాటారం, మహాదేవపూర్, మంథని మండలాల్లో బుధవారం పర్యటించ నున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు మహాదేవపూర్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రభుత్వ వైద్యశాల ముం దు ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఉదయం తొమ్మిది గంట లకు కాటారం మండల కేంద్రంలోని కాటారం భూపాలపల్లి హైవేపై ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు. ఉదయం 10 గంటలకు గారెపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరణ చేస్తారు. అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకు మంథనిలో శివకిరణ్ గార్డెన్స్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 4 మండలాల అంగన్వాడీలకు సంబంధించిన పోషన్ మహా పక్వాడ్ కార్యక్రమం తో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.