ఆదర్శ విద్యార్థిని అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు
– ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు ఎంపిక పట్ల హర్షం
తెలంగాణ జ్యోతి, కాటారం: ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు ఎంపికైన ఆదర్శ హై స్కూల్ విద్యార్థి అద్నాన్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆదర్శ స్కూల్ విద్యార్థి అద్నాన్ ఎంపిక పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రాంతానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని ప్రోత్సహించిన ఆదర్శ స్కూల్ ఛైర్మన్ కరుణాకర్ రావు, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, కోచ్ లు మడక మధు, ప్రభాకర్ రెడ్డి, బీఏరావు, విద్యార్థి తల్లిదండ్రులను అభినందించారు. అయితే సైన్స్ ఫెస్టివల్ కు జాతీయ, అంతర్జాతీయ ఇన్నోవేటర్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు హాజరవుతారని, వీరు విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలు, పరిశోధనాంశాల పట్ల మరింత అవగాహ న కల్పిస్తారని పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కోచ్ మడక మధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, విద్యార్థి తండ్రి అమీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..