మంత్రి సీతక్క ఏటూరునాగారంలో సుడిగాలి పర్యటన
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆకులవారి ఘణపురం బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి మంత్రి సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్ర విద్యార్థులతో కలిసి అల్పహారం చేస్తూ హస్టల్ లోని పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని రామాల యం వీధిలో పల్లె దవాఖానను సందర్శించి వర్షాలు సమీపించడంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని డాక్టర్ లకు సూచనలిచ్చారు. అనంతరం కరకట్ట పనులను పరిశీలించి తగు సూచనలు తెలియజేశారు. వీరి వెంట పోలీస్ సిబ్బంది, పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.