కొమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

కొమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలో వై జంక్షన్ వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన కొమురంభీం విగ్రహాన్ని గురువారం పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఐటీడీఏ నుంచి వై జంక్షన్ వరకు గిరిజన నృత్యాలు,డోలు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జల్, జంగిల్, జమీన్ నినాదంతో ప్రజలను ఐక్యం చేసి నిజాం ప్రభుత్వంతో తమ హక్కుల కోసం పోరాడి వీర మరణం పొందిన మన్యం వీరుడు కొమురం భీమ్ అని, కొమురం భీమ్ చేసిన నినా దాలను, పోరాటాల స్పూర్తితో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నినాదం నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో ఉద్యమం చేసి స్వరాష్ట్రం సాదించుకున్నామని గుర్తుచేశారు. ఆదివాసీ లు ఆయన పొరాట స్పూర్తితో ఆయన ఆశయసాధనకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.అన్ని రంగాల్లో ఆదివాసు ల అభివృద్ధికి ప్రభుత్వం పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నదని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్ర మంలో ఏటూరునాగారం డివిజన్లోని ఆదివాసీ, తుడుండెబ్బ సంఘాల నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment