7న ఇఫ్తార్ విందుకి విచ్చేయనున్న మంత్రి శ్రీధర్ బాబు.

7న ఇఫ్తార్ విందుకి విచ్చేయనున్న మంత్రి శ్రీధర్ బాబు.

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలంలో 7 ఆదివారంన సాయంత్రం 5:30 గంటలకు జామ మజీద్ లో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకి ఐటీ,ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్ మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.