ఏజెన్సీ ప్రాంతంలోకి వలస గిరిజనేతలను అరికట్టాలి
– అక్రమ భవనాలను తక్షణమే కూల్చి వేయాలి
– తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు సోమరాజు డిమాండ్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మైతాపురం గ్రామంలో తుడుం దెబ్బ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహిం చారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ ములుగు జిల్లా ఉపా ధ్యక్షులు చింత సోమరాజు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోకి అక్రమ గిరిజ నేతర వలసలు విపరీతంగా పెరిగి పోతున్నాయని అన్నారు. అందుకు ప్రధాన రాజకీయ పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. ఎల్ టి ఆర్ 1/59,1/70 చట్టాలను ఉల్లంఘించి భూముల క్రయ,విక్రయాలు జరిపి అక్రమ బహుళ అంతస్తు నిర్మాణాలు చేపడుతున్నారు. సంబంధిత రెవిన్యూ, గ్రామపంచాయతీ అధికారులు ముడు పులు తీసుకొని వాటికి దొడ్డి దారిన ఇంటి పన్ను రసీదులను, కరెంటు మీటర్లను మంజూరు చేస్తున్నారని ఆయన ఆరోపిం చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వలస గిరిజనేతరు లకు ఎటువంటి నివాస గృహానికి కానీ, రేషన్ కార్డు గాని, ఓటర్ ఐడి, కరెంట్ మీటర్, ఇంటి పన్ను రసీదు తీసు కోవడానికి వారు అనర్హు లని ఆయన అన్నారు. సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులు తక్షణమే వలసవాదు లను గుర్తించి వారిని ఏజెన్సీ ప్రాంతాల నుండి తరిమి వేయాలని, అలాగే అనుమ తులు లేని అక్రమ భవనాలను కూల్చివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో, పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో ఆదివాసి నాయకులు భోగం క్రాంతి కుమార్, చింత జగన్, నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.