వైద్య సిబ్బంది సమన్వయంగా పనిచేయాలి
– ఈ ఔషధీ వర్క్ షాప్ లో హన్మకొండ జిల్లా డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ అల్లం అప్పయ్య
హన్మకొండ, తెలంగాణ జ్యోతి : వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ ఆఫీసర్స్ సమన్వయంగా పనిచేసి మందుల నిల్వలు కాలం చెల్లకుండా సద్వినియోగం చేసుకోవచ్చని హన్మకొండ డి. ఎం.హెచ్.ఓ డాక్టర్ అల్లం అప్పయ్య అన్నారు. శనివారం కాకతీ య యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో హన్మకొండ జిల్లాలోని అన్ని ఆసుపత్రుల పి.హెచ్.సి., సి.హెచ్. సి వైద్యులు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్స్ లకు ఈ ఔషధీ పైన సెంట్రల్ మెడిసిన్ స్టోర్, జిల్లా వైద్యశాఖ సంయుక్తంగా నిర్వహించిన వర్క్ షాప్ లో హన్మకొండ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్. అల్లం అప్పయ్య మాట్లాడు తూ 330 రకాల మందులు పి.హెచ్.సి లకు వినియోగించు కోవచ్చని అన్నారు. మొత్తం సి.ఎం.ఎస్ ల ద్వారా డి.ఎం.ఈ. టి.వి.వి.పి., పి.హెచ్.సి లకు 568 రకాల మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు భవిష్యత్తులో వార్షిక ఇండెంట్లు పంపేటప్పుడు పారదర్శకంగా అవసరమైన మందులను ఇండెంట్ చేయాల్సిన బాధ్యత వైద్యులు, ఫార్మసిస్టులపై ఉందన్నారు.సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసిస్టు ఉప్పు భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రాలలో సి.ఎం.ఎస్ ల ఏర్పాటుతో మందుల సరఫరా మెరుగు పడనుందన్నారు.ఈ వర్క్ షాప్ లో సుమారు 130 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టి.వి.వి.పి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్, జి.ఎం.హెచ్. ఆర్.ఎం డాక్టర్ అంబరీష్, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ విజయ్ కుమార్, కే.యూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్, ఫార్మాసిస్టులు బత్తిని సుదర్శన్ గౌడ్, కందకట్ల శరత్ బాబు, నళిని, జిల్లా అధికారులు అశోక్ రెడ్డి, ప్రసన్న కుమార్, మాధవ రెడ్డి, వైద్యులు, సిబ్బంది రజనీకాంత్,క్రాంతికుమార్ పాల్గొన్నారు