ఏదిర ఆరోగ్య కేంద్రం పరిధిలో మహిళలకు వైద్య పరీక్షలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం వెంకటాపురం లోని పల్లె దవాఖానాలో ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా 82మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 17 మంది నుండి రక్తపూత నమూనాలు సేకరించి ములుగు హబ్ కు పరీక్షల నిమిత్తం పంపినట్లు ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ తెలిపారు.