తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైద్య శిబిరం
ఏటూరునాగారం,తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా ఏటూ రునాగారం మండలం చిన్నబోయినపల్లి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నంత పాఠశాల నందు తుమ్మ శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికేర్ మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి సీనియర్, ఎక్స్ పీరియన్స్ కలిగిన వైద్య సిబ్బందితో ప్రతి సంవత్సరం పేద ప్రజలకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని తుమ్మ శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని 20 రకాల వైద్యులచే ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు. మెడికేర్ హాస్పిటల్ తరపున ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించి, పేద ప్రజలకు అన్ని రకాల వ్యాధులకు టెస్టులు, స్కానింగ్ చేసి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నారు. ఉచిత మెడికల్ క్యాంపులో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. ఇంకా ఏమైనా అనారోగ్య లక్షణాలను ఉన్నట్టయితే వారిని కూడా మెరుగైనన వైద్యం కోసం మా తరఫున హైదరాబాదుకి పంపిస్తామని తెలిపారు. పేద ప్రజలు సరైన వైద్యం లేక ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారన్నారు. ప్రజలంతా ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలని, చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హెల్త్ క్యాంప్ పెట్టి ఉచితంగా మందులు ఇచ్చినందుకు 10 గ్రామాల ప్రజలు తుమ్మ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.