Medaram | మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ

Medaram | మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ

Medaram | మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ

ములుగు/తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్కల మినీ జాతరకు అంకురార్పణలో ప్రధాన ఘట్టం మండమెలిగే పండుగ. ఈ మండ మెలిగే పండుగను బుధవారం గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించా రు. మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడులను వేకువజామునే పూజారులు ఆలయాలను పుట్టమట్టితో గుడులు అలికి… మామిడి తోరణాలతో పూజారులు అలంకరణ చేశారు. మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, గిరిజన ఆడపడుచులు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు, గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు, పూజలు నిర్వహించి బూరుగు కొమ్మలతో దిష్టి తోరణాలు కట్టారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ చేస్తారు. బుధవారం రాత్రి గద్దెల చెంత పూజలు చేసి తల్లులకు నైవేద్యాలు సమర్పించి రేపు ఉదయం వరకు పూజలు నిర్వహిస్తారు. 12 నుండి 15 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది. తల్లుల వద్ద భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించు కుంటున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Medaram | మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ”

Leave a comment