రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
– ఆటో డ్రైవర్లకు సిఐ నాగార్జున రావు కౌన్సిలింగ్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాటారం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావు సూచించారు. సోమవారం కాటారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహిం చారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని సూచించారు. కార్లలో నల్లటి స్టిక్కర్లు, ఫిల్మ్లను అద్దాలకు అతికించవద్దని అన్నారు. వాహనాలకు అత్యవసర సైరన్, పోలీస్ సైరన్, అంబులెన్స్ సైరన్ లను వాడవద్దని హెచ్చరించారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను నడప వద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. ఆయన వెంట కాటారం సబ్ ఇన్స్పెక్టర్ మ్యాక అభినవ్ ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర వాహన తనిఖీ కేంద్రం ను సిఐ నాగార్జున రావు ఎస్సై అభినవ్ తో కలిసి వాహనాలను తనిఖీ చేపట్టారు.