బ్యాంకుల భద్రతపై చర్యలను పటిష్ట పరచాలి
– ఏటూరునాగారం ఎస్పీ శివ ఉపాధ్యాయ ఐపీఎస్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి :ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులతో లావా దేవీలు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన ఆయా బ్యాంకులు భద్రత చర్యలను పటిష్ట పరచు కోవాలని ఏటూరు నాగారం ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ అన్నారు. శనివారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వివిధ శాఖలకు చెందిన బ్యాంకులను ఆకస్మాత్తుగా సందర్శిం చారు. బ్యాంకు పరిసర చుట్టు ప్రాంతాలను, బ్యాంకు లాకర్లను వాటి పనితీరును ఆయా బ్యాంకుల మేనేజర్లు సిబ్బందితో కలిసి పరిశీలించారు. బ్యాంకుల భద్రత చర్యలపై మేనేజర్, అకౌంటెంట్ సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు. ప్రతి రోజు బ్యాంకు మూసి వేసే ముందు లాకర్లు పనిచేస్తున్నాయా లేదా, పటిష్టంగా ఉన్నాయా లేదా, బ్యాంకు నగదు లావాదేవీలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో సరిచూసుకోవాల న్నారు. రుణగ్రస్తులు తమ బ్యాంకుల్లో తనక పెట్టిన బంగారం నిల్వలను పర్యవేక్షించాలన్నారు. ఏటీఎం వద్ద సీసీ కెమెరాలు అన్ని దిక్కుల ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బ్యాంకులలో సీసీ కెమెరాలు నిత్యం పనిచేసే విధంగా చర్యలు తీసుకోని అలర్ట్ గా ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ అనునిత్యం తమకు అందుబాటులో ఉండి భద్రత చర్యలను పర్యవేక్షిస్తుంద ని, బ్యాంకుల పరిధిలో ఏమైనా భద్రత సమస్యలు తలెత్తుతే పోలీసు శాఖ వారికి సమాచారం అందించాలని అన్నారు. నిత్యం ప్రజా రక్షనే ద్వేయంగా, ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ తమ ప్రాణాలు పణంగా పెట్టి భద్రత కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. అనుమానస్పదంగా కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే పోలీస్ శాఖ వారికి సమాచా రం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్, పోలీస్ సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొన్నారు.