పత్తిపల్లి పాఠశాలలో గణిత స్థిరాకం “పై”డే వేడుకలు

పత్తిపల్లి పాఠశాలలో గణిత స్థిరాంకం “పై”డే వేడుకలు

– గణితంతో చక్కని భవిష్యత్తు : హెచ్ఎమ్ ప్రేమలత

ములుగు, తెలంగాణ జ్యోతి : మండలంలోని పత్తిపల్లి పాఠశాలలో గణిత స్థిరాంకం “పై”డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు సి. ప్రేమలత “ఫై” లోగోను ఆవిష్కరించారు. గణిత మంటే స్పష్టత, ఖచ్చిత త్వం, వేగం, తార్కికం.. అని నిత్యం మన జీవితం గణితంతో ముడిపడి ఉందని, అందుకే విద్యార్థులు చిన్ననాటి నుండే గణితాన్ని ఆసక్తితో నేర్చుకొని చక్కని భవిష్యత్తును సొంతం చేసుకోవాలన్నారు. అనంతరం గణిత ఉపాధ్యాయులు శ్రీ ఎస్ మురళీధర్ “ఫై” విలువను గురించి వివరిస్తూ.. ఇది ఒక గణిత స్థిరాo క మని వృత్తం చిన్నదైనా, పెద్దదైనా, మరీ పెద్దదైనా దానియొక్క చుట్టుకొలత, వ్యాసముల నిష్పత్తి ఎల్లప్పుడూ సమానంగా 3.141… గా ఉంటుందని, ఇది ఒక గణిత అద్భుతం అని, ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ముందు గా పరిచయం చేసింది భారత గణితశాస్త్రవేత్తలైన ఆర్యాభట్ట, మాధవన్ లే అని.. కానీ ప్రచారంలో పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలకన్నా వెనుకబడి ఉండడం వల్ల గూగుల్ నెట్ లలో ఇతరుల పేర్లు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి అన్నారు. అలాగే “ఫై” వంటి గణిత ఆవిష్కరణలను విద్యార్థులకు బాల్యంనుండే వివరిస్తే వారు గణితంఫై ఆసక్తిని, అన్వేషణను కొనసాగించి ఉజ్వల భవిష్యత్తుకై అడుగులు వేస్తారని.. అందుకే ప్రతీ విద్యాసంస్థ “ఫై”డే ను వేడుకగా జరపాలన్నారు. ఇందులో ప్రాజెక్ట్ పనులను, కృత్యాలను, అసైన్మెంటులను ఇచ్చి తీర్చిదిద్దాలని తెలిపారు… ఈ కార్యక్రమంలో ప్రధానోపా ధ్యాయురాలు సి. ప్రేమలత ఉపాధ్యాయులు ఏ. రాజు, ఎస్. మురళీధర్, ఎన్. రజిత,ఎస్. నర్సింహాచారీ, కే. నాగేందర్, ఏ. ప్రతాప్, శివకుమార్, అనంతరములు పాల్గొని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment