బిజెపి నేత ఇంట్లో భారీ చోరీ

బిజెపి నేత ఇంట్లో భారీ చోరీ

బిజెపి నేత ఇంట్లో భారీ చోరీ

– వెండి బంగారు ఆభరణాలు, నగదు చోరీ. 

– దర్యాప్తు ప్రారంభించిన క్లూస్ టీం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న బిజెపి సీనియర్ నేత సంకా హేమ సుందర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం… ఆదివారం వేకువజామున బిజెపి నేత హేమ సుందర్ కుటుంబంతో సహా కొత్తగూడెం వెళ్లి అదే రోజు రాత్రి పొద్దుపోయాక తిరిగి ఇంటికి వచ్చారు. తలుపుల తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న కేజీన్నరకు  పైగా వెండి పాత్రలు, దేవుడు సామాగ్రి తో పాటు, రెండు తులాల బంగారు నగలు, 20 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.  హోటల్ నిర్వహిస్తున్న బిజెపి నేత సంకా హేమ సుందర్ ముందు పోర్షన్ లో కూల్ డ్రింక్ బాటిల్స్, సిగరెట్ పెట్టెలు, ఇతర సామాగ్రిని కూడ దోచుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సోమవారం ఉదయం వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ఆధ్వర్యంలో క్లూస్ టీం దర్యాప్తును ప్రారంభించారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న దొంగలు పట్టపగలే ఆదివారం ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వెండి బంగారు నగలతో పాటు, 20 వేల నగదు తో సుమారు మూడ లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాపీ హోటల్ టిఫిన్ సెంటర్ పెట్టుకొని కష్టపడి సంపాదించుకొని దాచుకున్న నగదు, వెండి, బంగారు వస్తువులు దొంగలపాలు కావడంతో ఆకుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment