బిఎస్పి నుంచి భారీగా కాంగ్రెస్ లో చేరికలు
– కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం లో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ఉపయోగ పనులకు ఆకర్షితులై భారీగా బీఎస్పీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఎస్పి నాయకులు అట్టెం రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిఎస్పీకి చెందిన నాయ కులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు సమక్షంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య నేతృత్వంలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి మంత్రి ఆహ్వానించారు. కరీంనగర్ పెద్దపెల్లి కమాన్పూర్ రామగిరి రామగుండం మంథని తాడిచర్ల కాటారం మహా ముత్తారం మహాదేవపూర్ మండలాల నుంచి భారీ ఎత్తున సుమారు 500 మంది బిఎస్పి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1 thought on “బిఎస్పి నుంచి భారీగా కాంగ్రెస్ లో చేరికలు ”