సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాటి నరసింహదాసు మృతి పట్ల పలువురి సంతాపం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ తాటి నరసింహదాసు నాయుడు మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు, పుర ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నరసింహదాసు నాయుడు దశదిన కర్మ కాండ సందర్భంగా శనివారం వారి స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్ఫించారు. నరసింహాదాసు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకు లు కాళ్ల సుందర్రావు, పల్నాటి నాగేశ్వరరావు, చిట్టెం టాకయ్య, బాపినీడు చౌదరి, గూడూరి నాగేంద్ర ప్రసాద్, పుర ప్రముఖులు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.