జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చెయ్యండి  

Written by telangana jyothi

Published on:

జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చెయ్యండి  

– ఆశించే స్థాయి నుంచి..శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి  

– దేశమంతా బీసీ ఉద్యమం..ఢిల్లీ కోటపై బహుజన జెండా ఎగేరయ్యాలి

– వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు

హనుమకొండ , తెలంగాణ జ్యోతి : బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలనే సంకల్పంతో దేశమంతా బీసీ ఉద్యమాన్ని విస్తరించి, ఢిల్లీ కోటపై బహుజన జెండాను ఎగురవేసేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఉద్యమాలు కొనసాగుతు న్నాయని, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఆగస్టు 7న పంజాబ్ లోని అమృత్ సర్ లో జరిగే అఖిల భారత జాతీయ ఓబిసి 9వ మహాసభ వాల్ పోస్టర్ ను ఈ రోజు హన్మకొండ లోని బాలసముద్రంలో గల ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. మన చెమట చుక్కల ద్వారా మన నెత్తుటిని చిందించి దేశ సంపదను సృష్టించే మనం, అన్ని రంగాల్లో వెనుకబడడానికి కారణం చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవ డమేనన్నారు. దేశ జనాభాలో 60 శాతంకు పైగా ఉన్న మనం, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం లేకపోవడంతో మనం అడుక్కునే స్థాయికి దిగజారితే, అర శాతం ఉన్న అగ్రవర్ణాలు అధికారం అనుభవిస్తూ, అన్ని రంగాలను వారి గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని మనలను ఎప్పటికీ వెనకకు నెట్టి వేస్తున్నారని, బీసీ అంటే ఒక బిగ్గెస్ట్ క్యాస్ట్ అని, బ్రిలియంట్ క్యాస్ట్ అని, బెస్ట్ క్యాస్ట్ అని ప్రపంచానికి చాటిచెప్పేలా బీసీ లోకమంతా కంకణ బద్ధులు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. విద్యా, ఉద్యోగాలలో బీసీలకు రావాల్సిన వాటాను బీసీలకు ఇవ్వాలని, బీసీలకు విధించిన క్రిమిలేయర్ రద్దు చేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి, రిజర్వేషన్లలో మేమెంతో మాకు అంతా వాటా కల్పించాలని, మండల్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు పరచాలని, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు కోటా విధించాలి అనే నినాదంతో హలో బీసీ..చలో అమృత్ సర్ కార్యక్రమంతో 9వ అఖిలభారత జాతీయ ఓబీసీ మహా సభను ఆగస్టు 7న నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీ సోదరులు, బీసీ యువత, బీసీ విద్యార్థులు, బీసీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ ఓబీసీ మహాసభ ను విజయవంతం చేయాలని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, బచ్చు ఆనందం, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు తాళ్ల సంపత్ కుమార్, కాసగాని అశోక్ గౌడ్, పంజాల మధు, దాడి రమేష్ యాదవ్, కురిమిళ్ల శ్రీనివాస్, తాళ్లపెల్లి రమేష్, కడారి అనిల్, పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment