అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
– టియుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు, టిఎమ్ఎమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివ
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈనెల 14న ఆదివారం నిర్వహించ నున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు, టిఎమ్ఎమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివ కుమార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆదివారం రోజున ఉదయం 9 గం.లకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తా మన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.