సిపిఎం పార్టీ 4 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
వెంకటాపురం నూగూరు,తెలంగాణజ్యోతి: ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సిపిఎం 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ములుగు జిల్లా వెంకటాపురం సిపిఎం మండల కార్యదర్శి గ్యానం వాసు కోరారు. బుధవారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సభలో చర్చించనున్నట్లుగా ఆయన తెలిపారు. పేద ప్రజలపై భారాలు మోపుతూ మన వైపు దేశంలో మతోన్మాద భావజాలాన్ని పెంపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద సమస్యపై పరిష్కారానికి లోతైన చర్చలు ఈ మహాసభలో జరుపుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమ యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తుందన్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న గ్రామ సభలలో అర్హులైన లబ్ధిదారుల పేర్లు కనిపించడం లేదని గ్రామసభలు వద్ద ప్రజలే ఆందోళనకు దిగుతున్న సంఘటనలు ఎదురవు తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మహాసభలకు సిపిఎం అఖిలభారత కోఆర్డినేటర్ ప్రకాష్ కారత్,పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, బృందాకరత్, విజయ్ రాఘవన్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కట్ల నరసింహాచారి, మండల కమిటీ సభ్యులు చిట్టెం ఆదినారాయణ, తోట నాగేశ్వరరావు, సాధనపల్లి దేవి, బొగటా సాంబి, బొగటా విజయ కుమార్, డర్రా ఆనందు, గుండమల్ల సాగర్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.