వీధి పశువులను అరికట్టండి మహాప్రభో..! 

Written by telangana jyothi

Published on:

వీధి పశువులను అరికట్టండి మహాప్రభో..! 

– వెంకటాపురం పట్టణంలో వీధి పశువుల బెడద.

 – స్పీడ్ బ్రేకర్లు గా ప్రధాన రహదారిపై వీధి పశువులు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణంలో సుమారు రెండు కిలోమీటర్ల పొడవున మార్కెట్ ప్రధాన రహదారిపై యజమానులెవరో తెలియని వీధి పశువులు రోడ్డుపై తీష్ట వేయడంతో రాకపోకలు సాగించే వాహన దారులు, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. గుంపులు, గుంపులుగా వీధి పశువు లు రోడ్డుపై పడుకుని వచ్చే పోయే వాహనాలు, ఆటోల పై కుమ్ములా డుకొని మీద పడుతుండడంతో వాహనదారులు, ప్రయాణికు లు గాయాల పాలవుతున్నారు. ఇక జతకట్టిన పశువుల యితే గుంపులుగా ప్రజలు, వాహనాలు పైకి దూసుకు పోతున్నాయి. రోడ్డు పక్క కూరగాయలు అమ్ముకు నే చిరు వ్యాపారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఆకు కూరలు కూరగాయలు నోట కరచుకొని నష్టం చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో శివాలయం వద్ద నుండి మెయిన్ మార్కెట్ , పాత సినిమా హాలు వరకు రోడ్డు కు ఇరువైపుల ఉన్న దుకాణాలలో ఉండే అందచిన వస్తువులు, గృహస్తులు పెరడులో వేసుకున్న కూరగాయ మొక్కలు, బీర పాదులు, వంగ ,టమాటా సొరకాయ పాదులను మొక్కలను సైతం వీధి పశువులు రాత్రి సమయంలో కొరికి పాడుచేసి, ధ్వంసం చేస్తున్నాయి. ఊరు పొలి మేరల్లో ఉన్న వరినారు,పొలాలు సైతం వీది పశువులు పాడు చేస్తున్నాయి. వెంకటాపురం మేజర్ పంచాయతీ అధికారులు, వీధి పశువుల విషయంపై పలుమార్లు ప్రజలు ఫిర్యాదు లు చేసిన పట్టించుకోవటం లేదని, సుమారు 30 మంది పైగా జీ.పి. సిబ్బంది కలిగిన వెంకటాపురం మేజర్ పంచాయతీ గత ఏడాది రోడ్లపై సంచరించే, విశ్రాంతి తీసుకుంటున్న వీది పశువులు ను బందెల దొడ్డిలో పెట్టించి భారీగా జరిమానాలు విధించి, వీధి పశువుల బెడదను అరికట్టేవారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనా వీధి పశువుల విషయంపై వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్య నిర్వహణ అధికారి, మండల పంచాయతీ అధికారులు, మండల అధికారులు పట్టించు కోవటం లేదని వెంకటాపురం పట్టణ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారులు, రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పశువుల బెడదనుండి కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now