దోస్త్ ద్వారా మహాదేవపూర్ డిగ్రీ కళాశాలలో ప్రవేశలు
– ప్రిన్సిపాల్ జన్ను విజయ్ కూమర్.
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : కళాశాల విద్య కమిష నర్ ఆదేశాల మేరకు 2024-2025 అకాడమీక్ ఇయర లో డిగ్రీ ప్రవేశం మొదటి సంవత్సరంలో పొందాలనుకునే ఇంటర్మీ డియట్, తాత్సమానమైన రెండు సంవత్సరాల విద్యలో ఉత్తిర్ణులైన వారు దోస్త్ 2024 ప్రకటన వచ్చిందని దాని ద్వారా ఆన్ లైన్ లో దశల వారీగా నమోదు ప్రక్రియ ఉంటుందని ప్రిన్సిపాల్ జన్ను విజయ్ కుమార్ ఒకప్రకటనలో తెలిపారు. మీసేవా ద్వారా గాని ఆన్ లైన్ సెంటర్ ద్వారా గాని విద్యార్థులు తమ తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.ఈ నెల 6 తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయి 03-07-2024 వరకు మూడు దశలో కొనసాగుతుంది అని రిజిస్ట్రేషన్ 200 మాత్రమే చెల్లించిన తర్వాత సిటు అలాట్మెం ట్ ఉంటుందని ఈ సదావకాశాన్ని ఇంటర్మీడియట్ ఉత్తిర్ను లైనవారు వినియోగించుకోవాలని కోరారు.కోర్సులా వివరాలు ఆన్ లైన్ లో చూడవచ్చు అని ప్రిన్సిపాల్ జన్ను విజయ్ కూమర్ కోరారు. ఇంకా పూర్తి వివరాలకు మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.