మహబూబాబాద్ ఎంపిగా టికెట్ కేటాయించాలి.
– డా. పోరిక శంకర్ నాయక్
ములుగు ఫిబ్రవరి 21, తెలంగాణ జ్యోతి : మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ఎంపి అభ్యర్థిగా అవకాశం కల్పించాలని డా. నూనావత్ శంకర్ నాయక్ అన్నారు. బుదవారం రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డా. నూనావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాబోయే ఎంపి ఎలక్షన్లలో నాకు కాంగ్రెస్ పార్టీ తరపున మహబూబాబాద్ ఎంపిగా అవకాశం కల్పించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాంతో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అలు పెరుగని పోరాటం చేశానని తెలిపారు. కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కన పెట్టి అన్యాయం చేశారని, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోసుకునే దొంగల పార్టీ అని చెప్పిన మొట్ట మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. కాళేశ్వరం అవినీతిలో బి ఆర్ ఎస్ మునిగిపోయిందన్నారు. 15 వేల కోట్ల రూ,లను దోసుకుని,ఇసుక, మట్టి దందాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. కాళేశ్వరం కుంగడానికి,నేరెళ్ల దళితుల పై దాడులకు బి ఆర్ ఎస్ పార్టీ కారణమని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఎంపి గా పోటీ చేయాలని అనుకుంటు న్నానని అన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ముఖ్య అను చరుడిగా, ఈసారి మహబూబాబాద్ ఎంపిగా నిలబడుతు న్నానన్నారు. ఖమ్మం వరంగల్ మహబూబా బాద్ లలో ఎమ్మెల్యేల గెలుపుకోసం తనవంతుగా కృషి చేశానని అన్నారు.ఇప్పటి వరకు రెండు సార్లు ఎంపిగా పోటీ చేసిన పోరీక బలరాం నాయక్ కు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చి మంత్రిగా కొనసాగించాలని అన్నారు.వైద్యునిగా 28 దేశాల్లో జూనియర్ వైద్యులకు ఆపరేషన్లు చేయడంలో మెళకువలు అందిచడం, విద్యావంతుడు గా,ఉద్యమ కారుడుగా ఎంపిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న నాకు రాహుల్ గాంధీ సహకారం లభించడం సంతోషంగా ఉందన్నారు.బిజెపి అయోధ్యలో రామ మందిరం కట్టడం సంతోషకరమైన విషయమే కానీ భద్రాచలం రాముణ్ణి పట్టించుకో లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ 2000 కోట్లతో భద్రాచలం రాముణ్ణి అభివృద్ది చేస్తుందని, ఎయిర్ పోర్టు, సుందరీకరణ, భక్తులకు వసతులు పెంచడానికి కృషి చేస్తుందన్నారు.గిరిజన యూనివర్సిటీ,మెడికల్ కాలేజీలో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. బయ్యారం ఉక్కు గనుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ బిజెపి తోక సహాయంతో ఎంపి స్థానాలు గెలవాలని కుట్ర పన్నుతుందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో బి ఆర్ ఎస్ పార్టీని తెలంగాణలో బొందడపెట్టడం ఖాయం అని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత అవినీతిలో మునిగి నీతి వాక్యాలు వల్లించడం సరికాదు అన్నారు.ప్రజల కోసం ఏనాడు మాట్లాడలేదు అని అన్నారు.సీతక్క ఆదివాసి బిడ్డగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉండడం లంబాడీలు ,ఆదివాసీల అదృష్ఠం అని అన్నారు. ఈ సారి ఎంపిగా అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపిగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.