టెన్త్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎం ఈ ఓ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా విద్యాధికారి సూచనల మేరకు వాజేడు మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని వాజేడు మండల విద్యాధికారి తేజావత్ వెంకటేశ్వరరావు గురువారం పరిశీలించారు. పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువం టి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. మండల కేంద్రంలో 123 విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని ఆయన తెలిపారు.పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు నడుస్తున్నాయ లేదా అని పరిశీలించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సందర్భంగా విద్యార్థులకు పరీక్షా సమయంలో తాగడానికి చల్లని మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపర్డెంట్ సపక నాగరాజు, డివో సుజాత ఆధ్వర్యంలో ఇన్విజిలేటర్లకు పరీక్ష కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాలు గురించి వివరించారు. కట్టుదిట్టంగా పరీక్షల్ని నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామ న్నారు.ఈ కార్యక్ర మంలో ఇన్విజిలేటర్లు, హెచ్.ఎం. తదితరులు పాల్గొన్నారు.