పట్టా పాస్ బుక్ లేని రైతుల ఋణాలను మాఫీ చేయాలి

Written by telangana jyothi

Published on:

పట్టా పాస్ బుక్ లేని రైతుల ఋణాలను మాఫీ చేయాలి

ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ల ఆధ్వర్యంలో పట్టా పాస్ బుక్ లేని రైతుల ఋణాలను మాఫీ చేయాలి ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర నాయకులు తాటి పాముల వెంకట్రాములు, జిల్లా సహయ కార్యదర్శి జంపాల రవీందర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పంట ఋణాలు ఏకకాలంలో మాఫీ చేయడం సంతోషకరమైన విషయమే అన్నారు. అదే సమయంలో పట్టాధార్ పాస్ బుక్ లేకపోయినా పహనీనకల్ ఆధారంగా ఋణాలను ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం వీరిని విస్మరించడం వల్ల చాలా మంది నిజమైన రైతులు ఆందోళ నకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వానికి చెడుపేరు రాకూడ దంటే వెంటనే పహనీల ద్వారా పంట ఋణాలు పొందిన రైతుల ఋణాలను వెంటనే మాఫీ చేయాలి అన్నారు. కొంత మంది రైతులు తెలియక ఋణాలను రెన్యువల్ చేసుకోలే దనీ, అలాంటి వారిని రీషేడ్యూల్ పేరుతో మాఫీ చేయక పోవడం వల్ల ఆందోళనకు గురవుతున్నారన్నారు. కనుక రీషేడ్యూల్ ఋణాలను కూడా మాఫీ చేయాలన్నారు. అప్పు డు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అవు తుంద న్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సం ఘం జిల్లా నాయకులు ఎండి అంజద్ పాష, ఇంజం కొముర య్య, గుంజె శ్రీనివాస్, మాతంగి శ్యాంసుందర్, వడి సారయ్య, జక్కుల అయిలయ్య, మామిడి నటరాజ్, భూఖ్య రూప్ సింగ్, సీడం సమ్మయ్య, ముత్తయ్య, మర్రి స్వామి, కుక్కల రవి, ఈసం మహేందర్, లక్ష్మి నారాయణ, భక్కన్న, మేకల సాంబయ్య, కట్ల నరేష్, మహరాజు నారాయణ, ఆగ భోయిన సాంబయ్య, వట్టం సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment