పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం
– ఖాళీ ప్లాట్లలో నీళ్లు నిలిచి, పిచ్చిమొక్కలు ఉంటే జరిమానా విధిస్తాంః
– ములుగు మేజర్ జీపీ కార్యదర్శి రఘు
తెలంగాణ జ్యోతి ,ములుగు ప్రతినిధి : ములుగు పట్టణా న్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని, వచ్చే వర్షాకాలంను దృష్టి లో ఉంచుకొని పరిసరాల్లో చెత్తపేరుకుపోకుండా బాధ్యతగా వ్యవహరించాలని ములుగు మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి పి.రఘు సూచించారు. పట్టణ కేంద్రంలోని పలు కాలనీల్లో జీపీ సిబ్బంది సైడ్ కాలువలలోని డ్రైనేజీని ఎత్తివేశారు. పిచ్చిమొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇండ్ల మధ్యలో మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఖాళీ ప్లాట్ల యజమానులు మొరం పోసుకోవాలని, నీటి నిల్వలు పేరుకుపోయి పిచ్చి మొక్కలు పెరిగితే రూ.10వేల జరిమానా విధిస్తామన్నారు. యజమానులకు సమీప ఇంటి వారు సమాచారం అందిం చాలన్నారు. దోమలు, ఈగలు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, జీపీ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.