గిరిజనేతరుల భూమి పట్టాలు రద్దు చేయాలి.
– ఆదివాసి సంక్షేమ పరిషత్
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో శుక్రవారం ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు నరసింహారావు అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం మైన ములుగు జిల్లా వాజేడు మండలం లో ప్రభుత్వ, అసైన్డ్ భూములను గిరిజనేతరులు,భూస్వాములు దొడ్డి దారిన భూమి పట్టాలు చేసుకుంటు న్నారని ఆరోపించారు. 1/59,1/70 చట్టాలు తో పాటు, 5 వ షేడ్యూల్డు అమలులో ఉండగా గిరిజనేతర్లకు పట్టాలు ఏ విధంగా జరిచేస్తున్నారని ప్రశ్నించారు. గిరిజనేతరుల అక్రమ పట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ చట్టాలు అమల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాల పై ఎల్టిఆర్ కేసులు నమోదు చేయాలని ,భవనాలను సీజ్ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం ఆదివాసి నాయకులు రాధాకృష్ణ, బుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.