వెంకటాపురం శివాలయంలో లక్ష బిల్వార్చన పూజ
వెంకటాపురం శివాలయంలో లక్ష బిల్వార్చన పూజ
– భక్తులు తరలి రావాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం 22న లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహి స్తున్నట్లు, ఆలయ కమిటీ భక్తులకు విన్నవించింది. ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, విగ్నేశ్వర పూజ, శుక్రవారం ఉదయం ప్రారంభ కానున్నాయి. మధ్యాహ్నం స్వామివారికి విశేషమైన లక్ష బిల్వార్చన, మారేడు పత్రి పూజ, సాయంత్రం ఐదు గంటలకు రుద్ర హోమం, జ్యోతిర్లింగార్చన, సాయంత్రం కుంకు మార్చన, రుద్రహోమం, కుంకుమ పూజలు, రాత్రి 8:00 గంట లకు అన్నప్రసాద కార్యక్రమం తదితర భక్తిరస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది. ఈ మేరకు కరపత్రాల ద్వారా లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం ఆహ్వా న శుభ పత్రికలను గ్రామ గ్రామాన పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు.ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యా ర్థం ఆలయ కమిటీ విస్తృతమైన ఏర్పాట్లు నిర్వహిస్తున్నది.