రామాలయంలో ఘనంగా లక్ష తులసి అర్చన పూజ

రామాలయంలో ఘనంగా లక్ష తులసి అర్చన పూజ

రామాలయంలో ఘనంగా లక్ష తులసి అర్చన పూజ

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అను బంధ ఆలయమైన శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం లో ఆరుట్ల రామాచార్యులు శ్రీ రామాలయం అర్చకుల ఆధ్వర్యంలో వేద పండితులు ఘనంగా లక్ష తులసి అర్చన పూజను నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా స్వామి వారికి లక్ష తులసీ అర్చన, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించామన్నా రు. రూ. 2116 చెల్లించి లక్ష తులసి అర్చనలో పాల్గొన్న దంపతులకు స్వామివారి శేష వస్త్రములు తీర్థప్రసాదములు ఇచ్చి అర్చక స్వాములు ఆశీర్వచనాలు, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందిం చారు. ఈ కార్యక్రమంలో ఆల య కార్యనిర్వాహణాధికారి ఏ. మారుతి, సూపరింటెంట్ బుర్రి శ్రీనివాస్, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది, పాల్గొన్నారు.