కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న కర్నూలు పచ్చిమిర్చి
వెంకటాపురం, నూగూరు తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వ్యాపారులు కర్నూలు పచ్చిమిర్చిని రవాణా చేస్తు న్నారు. కూరగాయల కొనుగోలుదారులు కర్నూలు పచ్చి మిర్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపు తున్నారు. పొడవు గా మీడియం కారం ఉండే నిగనిగలాడే కర్నూలు పచ్చి మిర్చి ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత మిర్చి పరిస్థితి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన మిరప పంట సుమారు 50 నుంచి 60 శాతం నష్టం చేకూరిందని తెలుస్తున్నది. అధిక వర్షాల వలన మిరప పంట వైరస్ బారిన పడినది. రానున్న రోజుల్లో వర్షాల కార ణంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. పచ్చిమిర్చి కి గిరాకీ నెల కొనడంతో కోతలు జోరం దుకున్నాయి.మరియు రానున్న రోజుల్లో అధిక వర్షాల వలన మొక్కలు దెబ్బ తింటాయన్న భయాందోళన నడుమ పచ్చి మిర్చి కోతలు పెరిగాయి. మిర్చి పండించే ప్రాంతాల్లో వర్షాల కారణంగా సుమారు 15% నుంచి 20% శాతం వేరుకుళ్ళు సమస్య వైరస్ సమస్యలు మొదలయినాయి. రానున్న రోజు లలో అధిక వర్షాలు వలన పంట పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అత్యధికంగా మిరప పంట సాగు చేసే రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధరలు పడిపోయిన కారణంగా, ఈ సంవత్సరం 50% శాతం సాగు తగ్గించి ప్రత్యా మ్నాయ పంటలపై దృష్టి పెట్టారు. మరియు గత వారంలో కురిసిన వర్షాలతో మిర్చి నారు మళ్ళు అత్యధికంగా దెబ్బ తిన్నాయి. మరల నారు వేయాల్సిన పరిస్థితి వలన కొత్త పంట, నెల నుండి రెండు నెలలు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది . తెలుగు రాష్ట్రాలలో వాతావరణ శాఖ,వ్యవసాయ శాఖ తెలుపుతున్న నివేదికల ప్రకారంగా అధిక వర్షాల కారణంగా మిరప పంట చేతికొచ్చే పరిస్తితులు ఉన్నాయో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో ఆ పంట సాగు రైతులు వున్నారు.భిన్న వాతావరణ పరిస్థితుల వలన పంట తొలి దశలో నీరు లేక ఇబ్బంది నెలకొని వుండేది. ఇప్పుడు అధిక వర్షాల కారణంగా కోతల సమయంలో ఇబ్బందులు వున్నాఇ., దీని మూలాన లో పండే మిరపకు రేటు పెరగడం జరిగింది.ఈ వారంలో భయంకరమైన యాగి తుఫాను వలన ఎలాంటి నష్టం మిర్చి ప్రాంతాల్లో చేయనుందో అన్న భయాం దోళనలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం నుండి ఆకర్షణీయమైన పచ్చి మిర్చి తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు జిల్లా ప్రాంతాలకు రవాణా అవుతున్నది. పచ్చిమిర్చి పొడవుతో ఉన్న మీడియం కారం ఘాటు పచ్చిమిర్చి విక్రయాలు ములు గు జిల్లా వెంకటాపురం వాజేడు ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లలో కిలో 40, నుండి 50 రూపాయలు ధరతో హోల్సే ల్,చిరు వ్యాపారులు న్యాయమైన ధరలకు కొనుగోలు దారు లకు విక్రయిస్తున్నారు.