కొత్తగూడెంను ప్రత్యేక జీపీగా ప్రకటించాలి
కొత్తగూడెంను ప్రత్యేక జీపీగా ప్రకటించాలి
– అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తిప్పనపల్లి రవీందర్
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండ లంలోని కొండాయి గ్రామపంచాయతీ పరిధిలోగల దొడ్ల కొత్తూరు (కొత్తగూడెం) గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తిప్పన పల్లి రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఏటూరు నాగారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్ల కొత్తూర్ గ్రామాన్ని కొత్తగూడెంగా పేరు మార్చుతూ 2014లో అప్పటి జీపీ సర్పంచ్ సర్వేషరావు ఆధ్వర్యంలో రెవిన్యూ రికార్డులకు ఎక్కించారన్నారు. కొత్తగూడెం అనే ఈ ప్రాంతంలో పూర్వీకులు ఆవాస ప్రాంతం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిం చారన్నారు. అప్పుడున్న కొత్తగూడెం ప్రాంతలో కలరా ప్లేగు గత్తర వ్యాధులు ప్రబలి చాలామంది ప్రజలు చనిపోయిన సంద ర్భంలో మళ్లీ కొండాయి గ్రామనికి వలస వెళ్లడం జరిగిందన్నారు. మళ్లీ 1986 సంవత్సరం వరదల కారణంగా ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని 1995 సంవత్సరంలో కొండాయి గ్రామపంచా యతీలో నివసిస్తున్న కొంతమంది ప్రజలు కొత్తగూడెం ప్రాంతానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్నారన్నారు.ఇప్పటికైనా స్థానిక మంత్రి సీతక్క, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై పునరాలోచించి కొత్తగూడెం ను ప్రత్యేక జీపీగా ఏర్పాటు చేయా లని రవీందర్ కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం గ్రామస్తులు కోవెల రాజు, వావిలాల శ్రీను, పూణెం సమ్మయ్య, పాయం లక్ష్మ య్య, దబ్బగట్ల పాపారావు, మందపల్లి సత్యం, కోయిల రాంబా బు, బొల్లి సారయ్య, పాయం మహేష్, బుల్లి రాజు, మందపల్లి కృష్ణ, రాజేందర్, నవీన్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.