Komuram Bheem |  ఘనంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు.

Komuram Bheem |  ఘనంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు.

ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలో ఆదివాసీల పోరాట యోధుడు కొమురం భీమ్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకరన్ ల జయంతి వేడుకలను కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవని, ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించి న కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడన్నారు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు కొమురం భీమ్ అని సీతక్క అన్నారు. అదే విధంగా ఎస్ ఆర్ శంకరన్ ప్రజాసేవకుడంటే ప్రజాసంపదను ప్రజలకు చేర వేసే వాడే సివిల్ సర్వెంట్స్ ఎవ్వరికీ భయపడనక్కర్లేదని చెప్పిన మహనీయుడని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.