జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ గురుకుల విద్యార్ధి
జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ గురుకుల విద్యార్ధి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఈనెల 25 నుండి 29 వరకు చత్తీస్ ఘడ్ రాష్టంలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు వరంగల్ ఎస్ జి ఎఫ్ ఐ దస్రు, భూపా లపల్లి జిల్లా కార్యదర్శి రమేష్ లు తెలిపారు. ఈనెల 8 నుండి 10 వరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 14 ఇయర్స్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ లో వరంగల్ జట్టు తరుపున కాటారం గురుకులం క్రీడాకారు డు బి దేవేందర్ అత్యంత ప్రతిభ కనబరిచి చత్తీస్గడ్ రాష్ట్రం లోనిజరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక అయినట్లు వారు పేర్కొన్నారు. వీరి ఎంపిక పట్ల కలాశాల ప్రిన్సిపాల్ బి లాలు, వైస్ ప్రిన్సిపాల్ హెచ్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, పీడీ మహేందర్, పిఈటీ శ్రీనివాస్ కోచ్ మూల వెంకటేష్ ఉపాధ్యాయులు హార్షం వక్తం చేశారు.