కాటారం పోలీసుల వన మహోత్సవం
కాటారంప్రతినిధి, తెలంగాణజ్యోతి: తెలంగాణ వనమహో త్సవం కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పోలీసులు వనమహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కాటారం పోలీస్ స్టేషన్ ఆవరణలో కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ మ్యాక అభినవ్, సిఆర్పిఎఫ్, సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వన మహోత్సవం వల్ల పచ్చని చెట్లు ఆహ్లాదకరంగా ఉండడంతోపాటు చక్కటి గాలి లభిస్తుందని ఈ సందర్భంగా కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి అన్నారు.