అవార్డు అందుకున్న కాళేశ్వరం హరిత మేనేజర్
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన అవార్డుల్లో భాగంగా కాళేశ్వరం హరిత హోటల్ మేనేజర్ జక్కం సురేష్ ఎక్సలెంట్ అవార్డు అందుకు న్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గా ను హైదరాబాదులోని హరిత టూరిజం భవన్ హెడ్ ఆఫీసు లో రాష్ట్ర టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రకాష్ రెడ్డి (ఐపీఎస్)శుక్రవారం ఎక్స్లెంట్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.అవార్డు అందుకున్న ఆయనను పలువురు అభి నందించారు.