Kaleshwaram | సరస్వతి నదికి ప్రత్యేక పూజలతో పుష్కరాలు ప్రారంభం
– తొలిస్నానం చేసిన పీఠాధిపతి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దంపతులు
కాటారం, తెలంగాణ జ్యోతి : పుష్కర పండుగ కాలేశ్వరంలో అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభమైంది. భూపాలపల్లి జిల్లా కాలేశ్వరంలో గోదావరి, ప్రానహిత నదుల సంగమ తీరం లో అంతర్వాహిని సరస్వతి పుష్కరాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 5:44 గంటలకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. మాధవానంద సరస్వతి స్వామీజీ (రంగంపేట). తొలి స్నానం ఆచరించారు. కీర్తిశేషులు మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు సతీమణి జయమ్మ తల్లి తో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భార్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్లతో సరస్వతి పుష్కర స్నానాలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి అసోసియేషన్ సంఖ్యలో వచ్చిన భక్త జనం పుణ్యస్నానాలు ప్రారంభించారు. ముఖ్యంగా పుష్కరాల లో పితృదేవతలకు చేసే కార్యాలు పిండ ప్రదానం భక్తులు ప్రారంభించారు వేద బ్రాహ్మణులకు వివిధ రకాల దానములు ఇస్తున్నారు మహిళలు సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పైతగా లింగం ఏర్పాటు చేసి అభిషేకములు పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుండి సరస్వతి నది పుష్కర స్నానం కోసం ప్రజలు తరలి వస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అవధానుల మోహన్ శర్మ, డైరెక్టర్లు, శాఖల జిల్లా ఉన్నతాధి కారులు ఈ ప్రాంత కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు ప్రజలు పుష్కర స్నానం ఆచరించారు.