వెంకటాపురంలో ప్రజాపాలన విజయోత్సవాలపై కళాజాత
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ పథకాలపై కళాబృందాలు మండలంలో బుధవారం అవగా హన కల్పించారు. ములుగు జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారధి గోల్కొండ బుచ్చన్న బృందం నవంబర్ 19నుండి డిసెంబర్ 7వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ప్రజాపాల న కళాయాత్రతో వెంకటాపురం మండల కేంద్రం, బెస్తగూడెం, రామచంద్రపురం గ్రామాల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కళాజాత నిర్వహించారు. సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభు త్వం చేసిన, చేయబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల కు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ, ఆట పాటలతో అవగాహన కల్పించారు.ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుందని అన్నారు. దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలనీ, అలాగే ప్రజాపాలన విజయోత్సవాల్లో కూడా పాల్గొని, పథకాల పైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, గ్రామప్రజలు, కళాబృందం నాయకులు గోల్కొండ బుచ్చన్న, కనకం రాజేందర్, రేలా కుమార్, ఉండ్రాతి భాస్కర్, భద్రయ్య, శ్యామ్, రాము తదిత రులు పాల్గొన్నారు.