ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలి
– ఎస్పి శ్రీ కిరణ్ ఖరే
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించి, విచారణ జరిపి, కేసులు నమోదు చేయడంలో పాటు ప్రజలకు న్యాయం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాల యంలో ప్రజాదివాస్ కార్యక్రమం నిర్వహించి,16 మంది బాధితుల నుంచి ఎస్పి పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ బాధితులకు న్యాయం అందించే విషయంలో పటిష్టంగా పని చేయాలని అన్నారు. చట్టాలను అతిక్రమించే వారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను సహించబోమని హెచ్చరించారు. భూ తగాదాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, కోర్టు కేసులలో ఉన్న భూ తగాదాల విషయంలో కోర్టుల ఆదేశాలకు అనుగుణంగా నడుచు కోవాలని సూచించిన ఎస్పి, బాధితుల సమస్యలను సాధ్య మైనంత త్వరగా పరిష్కరించాలని పోలిసు అధికారులను ఆదేశించారు.