ఆదివాసి రైతుల కుటుంబాలకు న్యాయం చేకూర్చాలి
– జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ అధికారాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించి రైతులకు న్యాయం చేయండి.
– ఏజెన్సీ ప్రాంతాలలో భారత రాజ్యాంగం కల్పించిన 1/70 యాక్టు ను అమలు చేయండి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : నకిలీ మొక్క జొన్న విత్తనాలతో నష్టపోయిన ఆదివాసి రైతులకు న్యాయం చేకూర్చాలని బిజెపి రాష్ట్ర నాయకులు ఇస్లావత్ కళ్యాణ్ నాయక్ అన్నారు. శనివారం బిజెపి ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామ రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను బిజేపి నేతలు పరామర్శించి వారికి ఆర్ధిక సహయాన్ని అందజేశారు. బిజేపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ గత 53 రోజులుగా ఆదివాసి సంఘాలు, రైతులు మొక్కజొన్న సీడ్ విత్తనాలు వేసి మోసపోయిన రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతగాని దద్దమ్మ లాగా చేతులు కట్టుకొtని చూస్తుందన్నారు. 400 పైగా రైతులు దాదాపు 2 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న పంటలు వేసి నకిలీ విత్తనాలు రైతులకు ఇచ్చి మోసం చేసినటువంటి సింజెంటా, హైటెక్, బేయర్ వంటి కంపెనీలపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి పీ.డీ యాక్ట్ కూడా పెట్టేవరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. మొక్కజొన్న ఆర్గనైజర్ ల పేరుతో మధ్యవర్తులకు అధిక శాతం వాటాని ముట్ట చెబుతూ రైతుల కష్టాలను కాజేస్తున్న నాయకులను విడిచి పెట్టమన్నారు. గత 8 సంవత్సరాలుగా ములుగు జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న విత్తనాలను సాగుచేసిన రైతులకు తీవ్ర నష్టం కలిగిందని అన్నారు. రైతుల బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక తమ కష్టానికి తామే కారణం అంటూ నిందలు వేసుకొని బాధలను రైతులు దిగమింగుతున్నారన్నారు. మంత్రి సీతక్క సొంత జిల్లాలోనే రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక క్వారీలకు సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకునే లాగా నేతలు ఉన్నారన్నారు. రైతులకు అన్యాయం జరుగు తుంటే మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కనీసం వెంకటాపురం మండలానికి ఐటీడీఏ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ ఎటునాగారం పీవో నేటి వరకు కూడా రాకపోవడం రైతులకు అనుమానంగా ఉందని రైతులు తనతో చెప్పారన్నారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా సీడ్ కంపెనీలను వెంటనే బ్యా న్ చేయాలన్నారు . ఇంత మంది రైతులు నష్టపోతే పంట నష్టం కింద పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. అదేవిధంగా మోసం చేసిన కంపెనీలు కూడా రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 యాక్ట్ కు విరుద్ధంగా ఆర్గనైజర్లు రైతులకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు మరియు ఏ రకమైన విత్తనాలు కూడా ఈ ప్రాంతాలలో పంపిణీ చేయరా దన్నారు. ఏటూరునాగారం ఐటిడిఎ పిఓ ఏం చేస్తున్నారని అన్నారు.అదికారుల అలసత్వం , బాధ్యతా రాహిత్యం వల్లనే రైతుల ఆత్మ హత్యల వరకు తీసుకు వెళ్లారని అన్నారు. ఐటీడీఏ పీవో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఉన్నారే తప్ప రాజకీయాలకు లోబడి వారి అధికారాలను బాధ్యత రాహిత్యంగా చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఆదేశం మాత్రమే వాళ్లకు లక్ష్మణ రేఖ అని అన్నారు. నియంత పాలన వదిలి ఆదివాసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జవహర్లాల్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గొలకోటి త్రినాధ రావు, స్టేట్ గిరిజన మోర్చా జనరల్ సెక్రెటరీ కొత్త సురేందర్, ఎస్టి మోర్చా అధ్యక్షులు గడిపల్లి సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల రవీందర్ రెడ్డి,జినుకుల కృష్ణాకర్ రావు, జిల్లా కార్యదర్శి కొత్త సుధాకర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకురాలు గుగులోతు స్వరూప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పళ్ళ బుచ్చయ్య, పాలసీ ఎండ్ రీసెర్చ్ రాష్ట్ర నాయకులు రాజు నాయక్, జిల్లా కార్యాలయ కార్యదర్శి రవి రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కర్ర సాంబశివరెడ్డి, జిల్లా కార్యదర్శి అట్లూరి రఘురాం ,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు వినుకోలు చక్రవర్తి ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ మెంబర్ బోల్లె సునీల్, మండల కార్యదర్శి సాధన పెళ్లి విజయ్ కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట సతీష్, గిరిజన మోర్చా అధ్యక్షులు మట్టి రమేష్, మండల ఉపాధ్యక్షులు గారి ఆదినారాయణ, చిట్టెం ఈశ్వరరావు, మండల నాయకులు బోల్లె నాగేశ్వరరావు ,రామెల్ల రాజు, ప్రశాంత్ ,సందీప్ ,దళిత మోర్చా అధ్యక్షులు కోగిల శ్రీను యువ మోర్చాఅధ్యక్షులు నోముల కిషన్, వాజేడు మండలం సీనియర్ నాయకులు కందుల రామ్ కిషోర్ ,వాజేడు మండల అధ్యక్షుడు పెద్ది జగపతిబాబు, బిజెపి సీనియర్ నాయకులు సంక హేమ సుందర్, తుమ్మ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ నెంబర్ జవహర్లాల్ గారు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గొలకోటి త్రినాధ రావు, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, ఎస్టి మోర్చా అధ్యక్షులు గడిపల్లి సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల రవీందర్ రెడ్డి,జినుకుల కృష్ణాకర్ రావు, జిల్లా కార్యదర్శి కొత్త సుధాకర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకురాలు గుగులోతు స్వరూప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పళ్ళ బుచ్చయ్య, పాలసీ ఎండ్ రీసెర్చ్ రాష్ట్ర నాయకులు రాజు నాయక్, జిల్లా కార్యాలయ కార్యదర్శి రవి రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కర్ర సాంబశివరెడ్డి, జిల్లా కార్యదర్శి అట్లూరి రఘురాం, వెంకటాపురం మండల అధ్యక్షుడు రామిల్ల రాజ శేఖర్, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు వినుకోలు చక్రవర్తి ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ మెంబర్ బోల్లె సునీల్, మండల,అధ్యక్ష కార్యదర్శులు రామెళ్ళ రాజ శేఖర్, సాధన పెళ్లి విజయ్ కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట సతీష్, గిరిజన మోర్చా అధ్యక్షులు మట్టి రమేష్, మండల ఉపాధ్యక్షులు గారి ఆదినారాయణ చిట్టెం ఈశ్వరరావు, మండల నాయకులు బోల్లె నాగేశ్వరరావు, రామెల్ల రాజు, ప్రశాంత్ ,సందీప్ ,దళిత మోర్చా అధ్యక్షులు కోగిల శ్రీను, యువ మోర్చా అధ్యక్షులు నోముల కిషన్, వాజేడు మండలం సీనియర్ నాయకులు కందుల రామ్ కిషోర్, వాజేడు మండల అధ్యక్షుడు పెద్ది జగపతిబాబు, బిజెపి సీనియర్ నాయకులు సంక హేమ సుందర్, అజ్మీరా కిశోర్ నాయక్, కల్లెపు ప్రవీణ్, పైడిమల్ల రవితేజ, తుమ్మ సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.