సుప్రీంకోర్టు తీర్పుతో భాషోపాధ్యాయులకు న్యాయం
తెలంగాణ జ్యోతి ,ములుగు ప్రతినిధి : తెలుగు, హిందీ, పిఇటి ఉపాధ్యాయుల పదోన్నతులకు వ్యతిరేకంగా వేసిన కేసును శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టివేయ్యడంతో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.ఈ సంద ర్బంగా జిల్లా విద్యాశాఖ అధికారి పాణినికి మిఠాయిలు అంద జేసి పండితులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం జిల్లా ప్రధాన కార్యదర్శి జట్టి సుభాష్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో దశబ్దాలుగా పండితులు చేస్తున్న పోరాటానికి న్యాయం జరిగింది అన్నారు. ఈ విజయం ప్రతి భాషపండితుడి విజయంగా భావిస్తున్నాము అన్నారు. మా పోరాటానికి మద్దత్తు ఇచ్చిన ఇతర సోదర సంఘాలకు కూడ ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా పండితులకు పదోన్నతులు కల్పించా లన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, పాడ్య రవి, మమత, శ్రీలక్ష్మి,సునీత, సంధ్యారాణి పాల్గొన్నారు.