సామాన్యులకో న్యాయం.. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలకో న్యాయమా..? 

సామాన్యులకో న్యాయం.. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలకో న్యాయమా..? 

– మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : దక్షిణ కాశీగా పేరు గాంచిన కాలేశ్వరం ముక్తేశ్వర దేవస్థానంలో సామాన్యులకు ఓ న్యాయం, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలకు మరో న్యాయమా అన్నట్లుగా ఉందని మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భాస్కర్ వెంకటరమణ అన్నారు. ఇటీవల కాలేశ్వరం ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు కలిసి కాలేశ్వరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంలో జరిగిన ప్రోటోకాల్ వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది. కాలేశ్వరం దేవస్థానం అధికారులు మార్గదర్శకాలను పాటించకుండా వ్యవహరిం చిన తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని భాస్కర్ వెంకటరమణ డిమాండ్ చేశారు. అందుకు బాధ్యులైన వారిపై సత్వరమే చర్యలు చేపట్టాలని, మరోసారి ఆలయంలో ప్రోటోకాల్ వివాదాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కాళేశ్వర దేవస్థానం గర్భ గుడిలోకి ఎవరైనా లుంగీ పంచ పైనే కాళేశ్వర ముక్తిశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి. కానీ, శుక్ర వారం రోజున కేటిఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, బిఆర్ఎస్ నాయకులు మాత్రం షర్ట్, పాయింట్లుపై వెళ్లి దర్శనం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని వెంకటరమణ ప్రశ్నించారు. సామాన్య భక్తులకు ఒకలా, రాజకీయ నాయకులకు మరో విధంగా దర్శనం చేపించడం ఎంత వరకు సబబు అని అన్నారు. కాళేశ్వరం దేవస్థానంలో మార్గదర్శకాలను పాటించని అధి కారులపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, ముఖ్య మంత్రి కార్యాలయంకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వెంటనే దేవాదాయ కమిషనర్ పూర్తి స్థాయి విచారణ జరిపి, కాళేశ్వరం దేవస్థానం ఈవో, సూపరింటెండెంట్, ఇతర అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ డిమాండ్ చేశారు.