టీఎస్ జేయు ఉపాధ్యక్షుడిని సన్మానించిన జర్నలిస్టులు 

టీఎస్ జేయు ఉపాధ్యక్షుడిని సన్మానించిన జర్నలిస్టులు 

టీఎస్ జేయు ఉపాధ్యక్షుడిని సన్మానించిన జర్నలిస్టులు 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ టిఎస్ జేయు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన అరిగెల జనార్దన్ గౌడ్ ను కాటారం మండల జర్నలిస్టులు ఘనంగా శాలువాతో సన్మానించారు. శనివారం ఏవీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పావుశెట్టి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ గాదె రమేష్, కాయిత తిరుపతి, కుడుదుల కిష్టయ్య, ఈర్నాల సుమన్, గోనే సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.