మంత్రి సీతక్క ను కలిసిన జర్నలిస్టులు

మంత్రి సీతక్క ను కలిసిన జర్నలిస్టులు

ములుగు,జనవరి5, తెలంగాణ జ్యోతి : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను శుక్రవారం ములుగు క్యాంపు కార్యాలయంలో ములుగు ,వెంకటాపూర్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా జర్నలిస్టులు సీతక్కకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలతోపాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. అందుకు స్పందించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని అన్నారు. జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని జర్నలిస్టులకు సీతక్క హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు లు ఎండి షఫీ అహ్మద్, బేతి సతీష్ యాదవ్,జాలిగం శ్రీనివాస్, పిట్టల మధు, దూడబోయిన రాకేష్, గుర్రం శ్రీధర్, సుంకరి సంపత్ ,భూక్య సునీల్, ఒద్దుల మురళి ,సృజన్ ,సుమన్ వెంకన్న ,హరీష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.