ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న జర్నలిస్టులు
జనగామ, తెలంగాణ జ్యోతి : దళిత జర్నలిస్టుల ఆధ్వర్యం లో జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్లో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష, అతిధిలుగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు కే. శ్రీనివాస్, పల్లవిలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఆయన లిఖించిన రాజ్యాంగ పుస్తకానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది.