జర్నలిస్ట్ కె.ఎస్. ను పరామర్శించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లిలో సువిద్య పాఠశాల వ్యవస్థాపకులు, జర్నలిస్టు కేఎస్ అలియాస్ కొట్టే శ్రీశైలం పటేల్ ను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించారు. ఇటీవల కొట్టే శ్రీశైలం తల్లి బుచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం గారేపల్లిలోనీ సువిద్య స్కూల్ లో కొట్టే శ్రీశైలం కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు ఓదార్చారు. ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. బుచ్చమ్మ కుమారులను పేరుపేరునా విచారించారు. మంత్రి శ్రీధర్ బాబు వెంట మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాబు గౌడ్, కాటారం మాజీ ఉప సర్పంచి నాయిని శ్రీనివాస్ ముదిరాజ్ , మహాముత్తారం మాజీ జెడ్పిటిసి మడిపల్లి సమ్మయ్య ఉన్నారు.