అనుభవం లేనివారికి మెడికల్ కాలేజీలో కొలువులు..?

Written by telangana jyothi

Published on:

అనుభవం లేనివారికి మెడికల్ కాలేజీలో కొలువులు..?

– ఔట్ సోర్సింగ్ పోస్టుల ఎంపికలో రోస్టర్ విధానం సరిగా పాటించలేదని ఆరోపణ..!

– 27న 32మంది పేర్లతో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన ప్రిన్సిపల్ 

– రాతపూర్వకంగా తెలపాలని ప్రిన్సిపల్ ప్రకటన

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ పోస్టుల రిక్రూట్ మెంట్ లో అధికా రులు నిబంధనలు ఉల్లంఘించారని, రోస్టర్ విధానాన్ని సక్రమంగా పాటించలేదని, ఎక్స్ పీరియన్స్ లేకుండానే ఫైనల్ జాబితాలో పేర్లు ఖరారు చేశారని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా రూల్స్ పాటించకుండా ఫైనల్ లిస్ట్ ఎంపిక చేయడంపట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 27న మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ విడుదల చేసిన ఫైనల్ లిస్ట్ సక్రమంగా లేదనే విమర్శలు వస్తుండగా ఏవైనా అభ్యంత రాలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ప్రిన్సిపల్ సోమవారం మరొక ప్రకటన విడుదల చేయడం సందేహాలకు తావిస్తోంది. 

– 32 పోస్టులకు నోటిఫికేషన్

ఫిబ్రవరి 2024లో మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో 32పోస్టులను భర్తీ చేసేందుకుగాను కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ బి.మోహన్లాల్ మే 15, 2024న నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 17 నుంచి 22వతేదీ వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో 32 పోస్టులకు గాను ఔట్ సోర్సింగ్ పోస్టులకు దరఖా స్తులు రాగా అర్హుల జాబితాను తయారు చేశారు. మొదటి దఫాలో జూన్ 11న అర్హులతో కూడిన జాబితాను రిలీజ్ చేశారు. అదేవిధంగా మరోమారు కూడా మెరిట్ లిస్ట్ ను విడుదల చేశారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు గోవిందరావుపేట మండలం పస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 11 నుంచి 15వతేదీ వరకు స్కిల్ టెస్ట్ నిర్వహించారు. అందులో సుమారు 21మంది పాసైనట్లు లిస్ట్ విడుదల చేవారు. అందులో ఏజ్, విద్యార్హత, స్కిల్ టెస్ట్ లకు కలుపుకొని పర్సంటేజీలు తీసి మొత్తం 32మందితో ఫైనల్ జాబితా విడుదల చేశారు.

– అనుభవం  లేకుండానే …

ములుగు లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వివిధ విభాగాలలో 32పోస్టులకు ఈనెల 27న ఫైనల్ జాబితా విడుదల చేయగా అందులో నిబంధలకు విరుద్ధంగా వ్యవమరించి ఎంపిక చేశారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. డిసెక్షన్ హాల్ అటెండెంట్ల 4పోస్టులకుగాను ఏడాది ఎక్స్ పీరియన్స్ ఉండాల్సి ఉండగా ఎంపిక కాబడిన ఏ ఒక్కరికీ సీనియారిటీ లేదని త్రీమెన్ కమిటీ సభ్యులు విడుదల చేసిన జాబితాలోనే ఉంది. నోటిఫికేషన్ ప్రకారం ఏడాది ఎక్స్ పీరియన్స్ ఉండాల్సి ఉన్నా అధికారులు అనర్హు లకు ఎందుకు పట్టం కట్టారో అర్థంకావడంలేదు. జాబితాలో ముగ్గురికి ఎక్స్ పీరియన్స్ ఉండగా వారెవరూ ఎంపిక కాలేదు. 10 డాటా ఎంట్రీ పోస్టులకు గాను రోస్టర్ విధానంలో భాగంగా ఓపెన్ కేటగిరీలో ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉండ గా ఐదుగురిని ఎంపిక చేయడంపట్ల అభ్యం తరాలు వ్యక్తం అవుతున్నాయి. థియేటర్ అసిస్టెంట్ పోస్టుల కు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కావాల్స ఉండగా ఈ సంవత్సరం పాసైన వారికి మాత్రమే జాబ్ లు ఇచ్చారు. ల్యాబ్ అటెండెంట్ జాబితాలో నలుగురిని ఎంపిక చేయగా జూన్ 11న 35మందితో కూడిన మెరిట్ లిస్ట్ విడుదల చేయగా అందులో లేని వ్యక్తి పేరు ఫైనల్ లిస్ట్ లో రావడంతో మిగిలిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి తమ్ముడికి లోపాయకారి ఒప్పందంతో ఉద్యోగం ఇప్పించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 32మందితో కూడిన ఫైనల్ లిస్ట్ ను ఈనెల 27న మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ విడుదల చేయగా ఈ జాబితాపై అభ్యంతరాలు రావడంతో తిరిగి సోమవారం ప్రిన్సిపల్ మరో ప్రకటన విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే తమకు వ్రాతపూర్వకంగా చెప్పాలని సూచించారు. మెరిట్ జాబితాలోని పేర్లతో 1:10 లేదా 1:3 ప్రకారం లిస్ట్ విడుదల చేసి అభ్యంతరాలు తెలపాలని ప్రకటించాల్సింది పోయి ఇప్పుడు ఎలా స్పందిస్తారని ఆరోపిస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లతోపాటు ముడుపులతో జాబ్ సంపాదించారనే విమర్శలూ ఉన్నాయి. కాగా, మెడికల్ కాలేజీ పోస్టుల్లో తమకు సైతం కోటా వర్తింపజేయాలని కోరుతూ గతంలో ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే వారి విన్నపాన్ని అధికారులు పట్టించుకోకుండా ఫైనల్ జాబితా విడుదల చేయడంతో విధులు బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆస్పత్రి అధికారులకు లేఖ కూడా అందించినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికా రులు స్పందించి అవకతవకలను తేల్చి అర్హులను ఎంపిక చేయాలని ప్రజా, రాజకీయ సంఘాల నాయకులు, అభ్యర్థు లు డిమాండ్ చేస్తున్నారు.

– ఫైనల్ లిస్ట్ పై అభ్యంతరాలుంటే తెలపండి.. : బి.మోహన్ లాల్, ప్రభుత్వం వైద్య కళాశాల ప్రిన్సిపల్, ములుగు 

ములుగు ప్రభుత్వ వైద్యకలశాలకు సంబంధించి వివిధ విబా గములలో 32పోస్టులకు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన అర్హతనను బట్టి మెరిల్ లిస్ట్ విడుదల చేశాం. ఆలిస్ట్ పై ఏవైనా అభ్యంతరాలుంటే ములుగులోని ప్రభుత్వ ఆస్పత్రి లోగల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఆగస్టు 3వతేదీ సాయంత్రం 4గంటలలోపు రాతపూర్వకంగా ఫిర్యా దు చేయండి. అన్నిఅభ్యర్దనలను పరిశీలించి ఎంపికైన వారి ని పిలిచి, సెలక్షన్ కమిటి వారు ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తం.ఆ తరువాతనే ఎవరివైనా సర్టిఫికేట్స్ లో పొరపా ట్లు ఉంటె మెరిట్ లిస్టులో వారి తరువాత ఉన్నవారికి అవకా శం ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now