Jio | దీపావళి ధమాకా రూ.699కే జియో భారత్ ఫోన్
డెస్క్ : దీపావళి ధమాకా ఆఫర్ కింద జియో భారత్ 4జీ ఫోన్ల ధరలను తగ్గించింది. ఆఫర్‌లో భాగంగా రూ.999 ఫోన్‌ను రూ.699కే కొనుగోలు చేయొచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర కంపెనీల నెలవారీ రీఛార్జి ప్లాన్లతో (రూ.199) పోలిస్తే జియో భారత్ ఫీచర్ ఫోన్ ప్లాన్లు చౌకగా లభిస్తాయని జియో తెలిపింది. రిలయన్స్ జియో సిమ్ కార్డుతో మాత్రమే పనిచేసే ఈ ఫోన్లను దగ్గర్లోని రిలయన్స్ స్టోర్, జియోమార్ట్ లేదా అమెజాన్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చని తెలిపింది.