Jio 5G : అంబాని మరో ఆఫర్.. తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్…

Jio 5G : అంబాని మరో ఆఫర్.. తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్…

– జూన్లో విడుదలయ్యే అవకాశం..!

డెస్క్ : రిలయన్స్ జియో అధినేత అంబానీ మరో ఆఫర్, అతి తక్కువ ధరకే అతి త్వరలో ప్రకటించనున్న Jio 5G స్మార్ట్ ఫోన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. Jio 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAMతో వస్తుంది. అలాగే 128GB ఇంకా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అప్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీతో వస్తుంది. 33w ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి ఈజిగా ఛార్జింగ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇంకా ఛార్జింగ్ 2 రోజుల వరకు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను పరిశీలిస్తే 5.5 అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. మీరు సులభంగా 4K క్వాలిటీ వీడియోలను చూడవచ్చు. ఇప్పుడు చాలా మంది ఈ జియో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Jio 5G : అంబాని మరో ఆఫర్.. తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్...

ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం, జూన్ రెండవ లేదా మూడవ వారంలో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది. మీరు లాంచ్ తేదీ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ గురించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా త్వరలో ప్రకటించ నున్నారు. కానీ ఈ ఫోన్ లాంచ్ సమయంలో దీని ధర రూ.3000 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.