నిరుపేద ప్రమాద బాధితుడికి అండగా జయశంకర్ ఫౌండేషన్

నిరుపేద ప్రమాద బాధితుడికి అండగా జయశంకర్ ఫౌండేషన్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన తోట రవి పని నిమిత్తం బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ యాక్సిడెంట్ లో అతని రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కావడంతో అతనిని వెంటనే హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు అతని వైద్యానికి చాలా డబ్బులు ఖర్చవుతాయని చెప్పడంతో వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబం దాతల సహకారం కోరగా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ వారి కుటుంబానికి భరోసా కల్పించి వారికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. అలాగే భవిష్యత్తులో అతనికి ఏదైనా షాపు పెట్టించి జీవనోపాధి కల్పించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చీమల రాజు, మాచర్ల రాజేందర్, గుడాల రమేష్, ఫౌండేషన్ యూత్ ఇన్చార్జి చింతకింది రాజు ఫౌండేషన్ డైరెక్టర శీలం అనిల్, ఫోటోగ్రాఫర్ బల్ల సంపత్, కానిగంటి కిరణ్, ప్రవీణ్ తదితర సభ్యులు పాల్గొన్నారు.