జవహర్ నగర్ టోల్ ప్లాజా సిబ్బంది కళ్యాణ్ మృతి
ములుగు, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ టోల్ ప్లాజాలో పనిచేస్తున్న సంగు కళ్యాణ్ మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. టోల్ ప్లాజా రెస్ట్ రూమ్ లో కళ్యాణ్ నిద్రిస్తున్న సమయంలో మేనేజర్ బెదిరించడంతో కంగారుగా కిటికీ పై కాలు పెడుతూ దిగుతుండగా స్లిప్పయి తెల్లవారు జాము 3 గంటల సమయంలో కింద పడి తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. సంగు కళ్యాణ్ మృతి పట్ల టోల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తు ఆందోళన చేపట్టారు. సమా చారం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.