జనం సాక్షి విలేఖరి భలవన్మరణం

జనం సాక్షి విలేఖరి భలవన్మరణం

తెలంగాణ జ్యోతి, నర్సంపేట : ఖానాపూర్ మండలనికి చెందిన జనంసాక్షి పత్రిక విలేఖరి మానేపల్లి శివ (38)  ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధు వులు పోలీసులకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 28 శుక్రవారం తన ఇంటి వద్ద తెల్లవారు జామున పురుగుల మందు సేవించాడని పోలీసులు తెలిపారు. అనంతరం మెరుగైన  వైద్యం కోసం బంధువులు ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం  మృతి చెందాడని పోలీసు లు తెలిపారు.  పోస్టుమార్టం అనంతరం బంధువు లకు మృత దేహాన్ని అప్పగించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

             విలేకరులు భౌతిగాయానికి నివాళులు.

జనంసాక్షి పత్రికా విలేఖరికి జిల్లా రిపోర్టర్స్, మరియు ఖానా పురం మండలం విలేకరులు నర్సంపేట డివిజన్ రిపోర్టర్స్, భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.